ETV Bharat / state

సేవ్ ఇండియా డే సత్యాగ్రహానికి ఎస్టీఎఫ్ఐ మద్దతు - స్కూల్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా

కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. రైల్వే తదితర ప్రజాసేవా రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగష్టు 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవ్ ఇండియా డే సత్యాగ్రహ ఉద్యమానికి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర విద్యామంత్రి ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని, ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కేంద్రీకరణ విధానాలతో విద్యారంగంలో అంతరాలను మరింత పెంచేలా ఉందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి పేర్కొన్నారు.

Stfi Support Save India Day Satya graham On August 9th
సేవ్ ఇండియా డే సత్యాగ్రహానికి ఎస్టీఎఫ్ఐ మద్ధతు
author img

By

Published : Aug 6, 2020, 9:18 PM IST

Updated : Aug 6, 2020, 10:50 PM IST

కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని, అణగారిన వర్గాలకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావారవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసేవా రంగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగష్టు 9న నిర్వహించనున్న సేవ్​ ఇండియా డే సత్యాగ్రహ ఉద్యమానికి ప్రజాస్వామికవాదులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రతీ ఒక్కరు వ్యతిరేకించాలని, లేదంటే దేశంలో పేదలు చదువుకు దూరంగా నెట్టివేయబడతారని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యదర్శి వర్గం ఆన్​లైన్​లో సమావేశమయింది. సంఘం జాతీయ అధ్యక్షులు అభిజిత్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరోనా సాకుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో సంఘపరివార్ ఎజెండాను అమలు జరిపే కుట్ర చేస్తుందని సంఘం ప్రధాన కార్యదర్శి సిఎన్ భార్తి తెలిపారు. సీబీఎస్​ఈ సిలబస్ తగ్గింపు పేరిట తొలగించిన పాఠ్యాంశాలను పరిశీలిస్తే ఈవిషయం స్పష్టమౌతుందన్నారు. కరోనా కట్టడి కోసం, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా, పార్లమెంటులో చర్చ కూడా లేకుండా హడావుడిగా జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రైల్వే లైన్ల ప్రైవేటీకరణ, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు పెట్టుబడులు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమన్నారు. కార్పోరేట్లకు లాభాలు చేకూర్చడం కోసం సాధారణ ప్రజలపై భారాలు మోపటం సమంజసం కాదన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సత్యాగ్రహ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 12 న ఎస్టీఎఫ్ఐ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజానుకూల జాతీయ విద్యావిధానం కావాలనే నినాదంతో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో క్యాంపెయిన్ నిర్వహించేందుకు నిర్ణయించారన్నారు. కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా ఉందని, ఆన్​లైన్​ విద్య.. తరగతి గది బోధనకు ప్రత్యామ్నాయం కాదన్నారు. కేరళ ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ విద్యాబోధనను ప్రశంసించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేరళ మోడల్ విద్యాబోధనను అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎం. సంయుక్త, చావా రవి, ఆంధ్రప్రదేశ్ నుండి ఎస్.సాబ్జీ, పి.బాబురెడ్డి, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

Last Updated : Aug 6, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.