హైదరాబాద్ రామంతాపూర్లో రైతు బజార్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. మూసి సమీపంలో ఉన్న శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్ శాఖ డిప్యూటీ ఇంజినీర్ రాధాకృష్ణ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యుడు శాగ రవీందర్లతో కలిసి స్థల పరిశీలన చేశారు.
త్వరలో రైతు బజార్ పనులు ప్రారంభం
లాక్ డౌన్ ప్రభావం అన్ని వర్గాలపై పడిందని.. ప్రజలు వ్యాపారాలు చేసుకోవచ్చుకానీ.. ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సుభాష్ రెడ్డి తెలిపారు. ఒకే చోట గుంపుగా చేరవద్దని.. బయటకు వచ్చేవారు మాస్క్ విధిగా ధరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల