ETV Bharat / state

విచారణ కోసం పిలిస్తే... 108 వాహనానికి నిప్పంటించాడు! - 108 vehicle burnt in oongole city news

విచారణ కోసం పిలిచిన ఓ మాజీ రౌడీషీటర్ 108 వాహనానికి నిప్పుంటించిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ ఘటనలో వాహనం పై భాగం పూర్తిగా కాలిపోయింది. నిందితుడిని రిమ్స్ కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ కోసం పిలిస్తే... 108 వాహనానికి నిప్పంటించాడు!

author img

By

Published : Sep 16, 2020, 12:16 PM IST

108 వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. మాజీ రౌడీ షీటర్ అయిన ఓ వ్యక్తి 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు.

ఈ క్రమంలో సదరు వ్యక్తి ఠాణాలోని అద్దాలను ధ్వంసం చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతని మానసిక పరిస్థితి బాగాలేదని గ్రహించిన పోలీసులు... స్థానిక వైద్యశాలకు తరలించేందుకు 108 వాహనాన్ని రప్పించారు.

విచారణ కోసం పిలిస్తే... 108 వాహనానికి నిప్పంటించాడు!

పోలీసు స్టేషన్ కు వచ్చిన 108 వాహనంలోకి ఎక్కిన నిందితుడు తన చేతిలో ఉన్న అగ్గిపెట్టతో నిప్పు అంటించాడు. ఒక దశలో మంటలు ఎగిసిపడుతున్నా... అతడు బయటికి వచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహారించిన పోలీసులు అతడిని బయటికి తీసుకొచ్చి రిమ్స్ కు తరలించారు. నిందితుడి ఒంగోలులోని కరుణ కాలనీకి చెందిన నేలటూరి సురేశ్ గా గుర్తించారు.

ఇదీ చదవండిః ఎస్సై పేరిట నకిలీ ఫేస్​బుక్... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.