ETV Bharat / state

ఆర్టీసీకి గుదిబండలా మారిన డీజిల్ ధరలు

రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి గుదిబండలా మారిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై డీజిల్ ధరలు మరింత నష్టాన్ని తీసుకొస్తున్నాయి. ఆర్టీసీ సంస్థలో ఏడాదికి సుమారు 20 లక్షల కిలోమీటర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. దీనిపై ఆర్టీసీపై ఏడాదికి రూ. 1230 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది రెండు నెలల్లోనే ఆర్టీసీ డీజిల్​పై రూ. 342 కోట్లు ఖర్చు చేసింది.

ఆర్టీసీకి గుదిబండలా మారిన డీజిల్ ధరలు
ఆర్టీసీకి గుదిబండలా మారిన డీజిల్ ధరలు
author img

By

Published : Feb 23, 2021, 1:53 PM IST

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై పెరుగుతున్న డీజిల్​ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో రూ.1.76 పైసలు పెరగడం వల్ల ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్టీసీకి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిపోయాయి. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లో 9వేల 754 బస్సులు ఉన్నాయి.

వీటిలో 6వేల 579 ఆర్టీసీ బస్సులు, 3వేల 175 అద్దె బస్సులు ఉన్నాయి. డీజిల్​పై ఆర్టీసీకి ఎక్సైజ్​ సుంకం, వ్యాట్​ తదితర పన్సులు కలిపి గుదిబండగా మారిపోయాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జీతాలు రెండు వారాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. ఇప్పుడు రోజు రోజుకు డీజిల్​ ధరలు పెరుగుతుండటంతో ఎప్పుడు ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఆర్టీసీకి డీజిల్​పై వేసే ట్యాక్స్​ను మినహాయించాలని దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గత ఆరేళ్లలో డీజిల్​ వినియోగం వివరాలిలా...

సంవత్సరండీజిల్ వినియోగంఆర్టీసీ చేసిన ఖర్చుమొత్తం పన్నుల శాతం
2014-15 20.86 లక్షల కిలో లీటర్లురూ. 1230 కోట్లు43.80శాతం
2015-1619.52 లక్షల కిలో లీటర్లురూ. 9602 కోట్లు 82.95శాతం
2016-1719.17 లక్షల కిలో లీటర్లురూ. 1068 కోట్లు127.47 శాతం
2017-1820.05 లక్షల కిలో లీటర్లురూ. 1177 కోట్లు110.69 శాతం
2019-2017.15 లక్షల కిలో లీటర్లురూ. 1151 కోట్లు79.43 శాతం
2020-213.78 లక్షల కిలో లీటర్లురూ. 343 కోట్లు129.12శాతం

గడిచిన వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్ ధరలు

  • ఫిబ్రవరి 15న రూ.86.55
  • ఫిబ్రవరి 16న రూ.86.93
  • ఫిబ్రవరి 17న రూ.87.20
  • ఫిబ్రవరి 18న రూ.87.55
  • ఫిబ్రవరి 19న రూ.87.91
  • ఫిబ్రవరి 20న రూ.88.31
  • ఫిబ్రవరి 21న రూ.88.31
  • ఫిబ్రవరి 22న రూ.88.31

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.