ETV Bharat / state

కుప్పకూలిన మూడంతస్తుల భవనం - తెలంగాణ వార్తలు

ఏపీలోని కడపలోని నాగరాజుపేటలో మూడంతస్తుల భవనం కూలింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనాలతో పాటు ఇంటిలోని వస్తువులు ధ్వంసమయ్యాయి.

building-collapse-at-nagarajupeta-in-kadapa-district
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
author img

By

Published : Jun 8, 2021, 10:34 AM IST

Updated : Jun 8, 2021, 11:59 AM IST

ఆంధ్రప్రదేశ్​ కడపలోని నాగరాజుపేటలో మూడు అంతస్తుల భవనం తెల్లవారుజామున కుప్పకూలింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ద్విచక్ర వాహనాలతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసమైంది.

తప్పిన ప్రాణ హాని..

బాధితుల వివరాల ప్రకారం.. కూలిన భవనంలో యజమానితో పాటు వెంకటేశ్​​ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో వెంకటేశ్,​ అతని భార్య, నలుగురు పిల్లలతో పాటు బయటకు వచ్చేశాడు. వారు వచ్చిన కొద్ది క్షణాల్లోనే బిల్డింగ్​ కూలిపోయింది. కాస్త ఆలస్యమైన తమకు ప్రాణహాని ఉండేదన్నారు.

భవనం మరమ్మత్తుల కోసం యజమానురాలు... నిన్న ఇంటి కింద గుంత తవ్వించారని వెంకటేశ్​ దంపతులు చెప్పారు. ఈ ఘటనకు అదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: Viral: నడుస్తున్న బైకులో మంటలు

Last Updated : Jun 8, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.