ETV Bharat / state

నేటినుంచి బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం - ghmc

నాలుగు రోజుల సెలవులు అనంతరం నేడు శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన అనంతరం... ఈ నెల 9న ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించనున్నారు.

budget-meetings-resume-after-vacation
author img

By

Published : Sep 14, 2019, 6:34 AM IST

Updated : Sep 14, 2019, 8:20 AM IST

సెలవుల అనంతరం బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం

శాసనసభ, మండలిలో బడ్జెట్‌పై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న ప్రవేశపెట్టగా... నాలుగు రోజులు సెలవులు వచ్చినందున తిరిగి నేడు ఉభయసభలు సమావేశం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ రెడ్డి, ముఖేశ్​ గౌడ్, ముత్యంరెడ్డి, సోంభూపాల్‌కు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆశ్రమ పాఠశాలలు, ఐటీ పరిశ్రమలు, జీహెచ్ఎంసీలో మురుగు నీటిశుద్ధి కేంద్రాలు, సంచార పశు వైద్యశాలలు, కల్యాణలక్ష్మీ పథకాలు చర్చకు రానున్నాయి. మండలి ప్రశ్నోత్తరాల్లో మల్బరీ సాగు, సెర్ప్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఒప్పంద అధ్యాపకుల బదిలీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు, జీహెచ్ఎంసీ పరిధిలో పర్యావరణ కాలుష్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగనిర్ధారణ కేంద్రాలు, దేవాదాయ భూముల ఆక్రమణ వంటి అంశాలు చర్చించనున్నారు.

ఇదీచూడండి: సుపరిపాలనే లక్ష్యంగా పనిచేయండి: సోనియా

Intro:Body:Conclusion:
Last Updated : Sep 14, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.