ETV Bharat / state

భద్రతే ముఖ్యం.. కొత్తలైన్లకు ప్రాధాన్యం లభించే అవకాశం - కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టన నిర్మలా సీతారామన్

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు చేసిన కేటాయింపుల్లో ప్రయాణికుల భద్రత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆ మేరకు ప్రాధాన్యం లభించే సూచనలున్నాయి. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... మొత్తం రైల్వే శాఖకు చేసిన కేటాయింపులను మాత్రమే వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి పింక్‌ బుక్‌ ప్రవేశపెట్టకపోవడం వల్ల సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే సహా వివిధ జోన్లకు చేసిన కేటాయింపులపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి వివరాలను ఈనెల 5న వెల్లడించనున్నారు.

budget
కొత్తలైన్లకు ప్రాధాన్యం లభించే అవకాశం
author img

By

Published : Feb 2, 2020, 9:02 AM IST

దేశవ్యాప్తంగా 2020- 21లో 500 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 2,650 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ మార్గాలు, 600 కిలోమీటర్ల మేర గేజ్‌ మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ పనులకు రూ.14,950 కోట్ల నిధులను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వేకు అందుకనుగుణంగా కేటాయింపు జరిగితే సికింద్రాబాద్‌- మహబూబ్‌నగర్‌, గుంటూరు- గుంతకల్లు, విజయవాడ- భీమవరం- నిడదవోలు వంటి జంటమార్గాల పనులకు.. మనోహరాబాద్‌- కొత్తపల్లి, నడికుడి- శ్రీకాళహస్తి కొత్త లైన్ల పనులకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి.

నిధులు తగ్గే అవకాశం..

స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యాలకు ఈసారి నిధులు తగ్గే అవకాశం ఉంది. గతేడాది రూ.3,422 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ మొత్తం రూ.2,725 కోట్లకు తగ్గింది. డీజిల్‌ ఇంజిన్లతో నడిచే మార్గాల విద్యుద్ధీకరణ లక్ష్యం... గత ఏడాది 7 కిలోమీటర్లు ఉండగా, ఈసారి అది 6 వేల కిలోమీటర్లకు తగ్గింది. పాత పట్టాల మార్పిడి లక్ష్యం 3,900 కిలోమీటర్ల నుంచి ఈసారి 4వేల కిలోమీటర్లు పెరగడం కొంత సానుకూలాంశంగా ఉంది. రైలు ఇంజిన్లు, బోగీల వంటి రోలింగ్‌స్టాక్‌ నిధుల కేటాయింపు రూ.6,114 కోట్ల నుంచి రూ.5,786 కోట్లకు తగ్గింది.

స్పష్టత లేని..బుల్లెట్​ రైలు ప్రాజెక్టు..

పాతకాలం నాటి ఐపీఎఫ్‌ బోగీల ఉత్పత్తిని ఆపేసి... ఆధునికమైన 4,079 ఎల్‌హెచ్‌బీ బోగీలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టకుంది. ఈ బోగీలు ప్రయాణంలో అధిక వేగ సామర్థ్యంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టాన్ని తగ్గిస్తాయి. తెలంగాణ, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి, రాయలసీమ, ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను ఎల్‌హెచ్‌బీ బోగీల రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య నిర్మాణంలో ఉన్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కేంద్రం.. ముంబయి- హైదరాబాద్‌, పుణె సహా 6 మార్గాల్లో ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు.. ప్రాజెక్టుల విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు.

ఇవీ చూడండి: కేంద్రం అడగలేదు .. మేం ఇవ్వలేదు: కేంద్రం

TG_HYD_07_02_RAILWAY_BUDGET_PKG_3066407 REPORT:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు చేసిన కేటాయింపుల్లో ప్రయాణికుల భద్రత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆ మేరకు ప్రాధాన్యం లభించే సూచనలున్నాయి. బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి మొత్తం రైల్వే శాఖకు చేసిన కేటాయింపులను మాత్రమే వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి పింక్‌ బుక్‌ ప్రవేశపెట్టకపోవడంతో... సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే సహా వివిధ జోన్లకు చేసిన కేటాయింపులపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి వివరాలను ఈ నెల 5న వెల్లడించనున్నారు....LOOOOK V.O:దేశవ్యాప్తంగా 2020-21 లో 500 కిలోమీటర్లు మేర కొత్త లైన్లు, 2650 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ మార్గాలు, 600 కిలోమీటర్ల మేర గేజ్‌ మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ పనులకు 14,950 కోట్ల నిధులను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వేకు అందుకనుగుణంగా కేటాయింపు జరిగితే సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌, గుంటూరు-గుంతకల్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు వంటి జంటమార్గాల పనులకు, మనోహరాబాద్‌-కొత్తపల్లి, నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ల పనులకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి. మరో వైపు స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యాలకు ఈసారి నిధులు తగ్గే అవకాశం ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 3,422 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ మొత్తం 2,725 కోట్లకు తగ్గింది. డీజిల్‌ ఇంజిన్లతో నడిచే మార్గాల విద్యుద్దీకరణ లక్ష్యం గత ఏడాది 7 కిలోమీటర్లు ఉండగా, ఈసారి అది 6 వేల కిలోమీటర్లకు తగ్గింది. పాత పట్టాల మార్పిడి లక్ష్యం 3900 కిలోమీటర్ల నుంచి ఈసారి 4వేల కిలోమీటర్లు పెరగడం సానుకూలాంశమే. V.O:రైలు ఇంజిన్లు, బోగీల వంటి రోలింగ్‌స్టాక్‌ నిధుల కేటాయింపు 6,114 కోట్ల నుంచి 5,786 కోట్లకు తగ్గింది. పాతకాలం నాటి ఐపిఎఫ్‌ బోగీల ఉత్పత్తిని ఆపేసి, ఆధునికమైన 4079 ఎల్‌హెచ్‌బి బోగీలను ఉత్పత్తి చేయాలని లక్ష్యాంగా పెట్టకుంది. ఈ బోగీలు ప్రయాణంలో అధిక వేగ సామర్ధ్యంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టాన్ని తగ్గిస్తాయి. తెలంగాణ, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి, రాయలసీమ, ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను ఎల్‌హెచ్‌బీ బోగీల రైళ్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. దేశవ్యాప్తంగా 50 వేల వరకు ఐపిఎఫ్‌ బోగీలున్నాయి. వీటన్నింటి స్థానంలో ఎల్‌హెచ్‌బీలు మార్చాలంటే ప్రస్తుత లక్ష్యం ప్రకారం పదేళ్లు పడుతుంది. ఎల్‌హెచ్‌బీ బోగీల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముంబాయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మాణంలో ఉన్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కేంద్రం... ముంబాయి-హైదరాబాద్‌, పూణే సహా ఆరు మార్గాల్లో ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.