RS Praveenkumar on TSPSC Paper Leakage Issue : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను 48గంటల్లోగా రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్న ప్రవీణ్‌కుమార్... రాష్ట్రపతికి కూడా లేఖ రాస్తానన్నారు. స్వచ్ఛందంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి వైదొలగాలని కోరారు.
పేపర్ లీకేజీపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు : జనార్దన్ రెడ్డి హాయాంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ తెలంగాణ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలు బహిర్గత పరచాలని కోరారు. సెక్రటరీ పీఏకు ఎలా కాన్ఫిడెన్షియల్ రూం యాక్సెస్ లభించిందని... టెక్నికల్ సమస్యగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేసి... సిట్‌కి అప్పగించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి వైదొలగాలి. పేపర్ లీకేజీపై కేసీఆర్ మౌనంగా ఉన్నారు. లీకేజీపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయట్లేదు. జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేయాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటినవారి వివరాలు వెల్లడించాలి. కేసును సిట్‌కి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. తక్షణమే ఛైర్మన్, కమిషన్‌సభ్యులను తొలగించాలి.'-ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
సిట్ దర్యాప్తు ముమ్మరం : మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏఈ ప్రశ్నాపత్రం లీక్‌పై రేపు టీఎస్‌పీఎస్సీకి నివేదిక ఇవ్వనున్నట్లు సిట్ పేర్కొంది. సిట్ దర్యాప్తు అధికారి అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, శాంతిభద్రతల అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్... టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో 2 గంటలపాటు విచారణ జరిపారు. ప్రవీణ్‌కు సంబంధించిన క్యాబిన్‌లో తనీఖీలు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి కంప్యూటర్‌ల మరమ్మత్తు వ్యవహారంపై దృష్టి సారించారు.
ఏఈ పరీక్షకు కొన్ని రోజుల ముందు కాన్‌ఫిడెన్సియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర్ లక్ష్మీ కంప్యూటర్‌ను మరమ్మత్తు చేసిన రాజశేఖర్ రెడ్డి... అదే సమయంలోనే పేపర్‌ను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి ప్రవీణ్‌కు అందజేసినట్లు ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని ల్యాన్‌లు, పనితీరు, భద్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడు ప్రవీణ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రేణుక ఇచ్చిన రూ.10లక్షలు ఎస్బీఐ ఖాతాలో జమ చేసుకున్న ప్రవీణ్.. రూ.3.5లక్షలు తన బాబాయ్ ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: