BRS Speed Up in Election Campaign : శాసనసభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. మరో ఆరు రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. ఎన్నికలకు ముందుగానే సిద్ధమైన అధికార భారత రాష్ట్ర సమితి.. ప్రచార పర్వంలోనూ మిగతా పార్టీలకంటే ముందే ఉంది. మూడో మారు అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) .. అక్టోబర్ 15 నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం.. ఇప్పటి వరకు 74 సభల్లో పాల్గొన్నారు.
పార్టీ అభ్యర్థుల తరఫున కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను.. ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలోని పరిస్థితుల్ని పోలుస్తూ విడమరిచి చెబుతున్నారు. అప్పటి, ఇప్పటి పరిస్థితులపై గ్రామాల్లో చర్చ పెట్టాలని పదేపదే కోరుతున్నారు. మొదట్లో సాధారణంగానే ప్రసంగిస్తూ వచ్చిన సీఎం.. క్రమంగా తన ప్రసంగాల్లో వేడిని పెంచుతూ వస్తున్నారు.
బీఆర్ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు : కేసీఆర్
BRS Campaign in Telangana 2023 : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం చేసిన ప్రకటనలను.. కేసీఆర్ ఎండగడుతూ పోతున్నారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్, దళితబంధు, తదితరాలు ఉండాలంటే.. బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. హస్తం పార్టీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయని ప్రజలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి ఎన్నికల హామీలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇతర హామీలు ఇస్తూ కేసీఆర్ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
CM KCR Public Meetings Today : నేటి నుంచి ఈ నెల 28 వరకు కేసీఆర్.. మరో 23 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనని గులాబీ దళపతి.. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇవాళ తాండూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి ప్రజా ఆశీర్వాద సభల్లో (BRS Praja Ashirvada Sabha) కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
"మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ భారీగా తరలిరావాలని కోరుతున్నాను. నన్ను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను." - శ్రీనివాస్‌గౌడ్, మంత్రి
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలకు పదును - అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తున్న గులాబీదళం
Telangana Assembly Elections 2023 : మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా.. ఆయా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. కేటీఆర్ (Minister KTR) ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సూర్యాపేట జిల్లా కోదాడ, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ముల్కనూర్ రోడ్ షోలలో పాల్గొంటారు. సాయంత్రం జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో.. ఏర్పాటు చేసిన రోడ్ షోలకు ఆయన హాజరు కానున్నారు. మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ కవిత, ఇతర మంత్రులు, అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుంది : కేసీఆర్