BRS Financial Assistance Rs 1.50 Crore to Saichand And Jagadish Families : ఇటీవల గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమ నాయకులు సాయిచంద్, కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్‌ఎస్ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.1.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నెల జీతం వారికి సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్ భార్య వేద రజనిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సాయి చంద్ కుటుంబ, సాహిత్య, రాజకీయ నేపథ్యం : సాయి చంద్ 1984 సెప్టెంబరు 20న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. తండ్రి వెంకట్రాములు, తల్లి మణిమ్మ వీరిది పేద కుటుంబం. సాయిచంద్ ఆరో తరగతి నుంచి బాణీలు కట్టడం.. సొంతంగా పాటలు పాడడం చేసేవారు. పదో తరగతి వరకు అమరచింతలోనే చదువుకునే వారు. ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చదివారు. అక్కడ చదువుకుంటూనే అరుణోదయ, పీడీఎస్‌ఏ విద్యార్థి విభాగంలోనూ చేరారు. ప్రజా చైతన్యం కోసం పాటలు పాడేవారు.
Telangana Movement Leader Singer Sai Chand : 2001లో కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. ఆరోజు ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావుల మాటలు విని.. సాయిచంద్ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీలో చేరి ఉద్యమానికి అనుగుణంగా పాటలు రచించి.. పాడేవారు. గద్దర్, గోరంట వెంకన్న రచించిన పాటలను వేదికలపై పాడేవారు. 2009 తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతమాచారి మరణంతో రచించిన రాతిబొమ్మల్లోనా కొలువైన శివుడా అనే పాట ఎంతో గుర్తింపును సంపాదించారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాల్లో పాటలు పాడడం మొదలు పెట్టి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు దగ్గరయ్యారు. సాయిచంద్, అరుణల 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కలరు. 2021లో సీఎం కేసీఆర్ సాయి చంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. జులై 29న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ చరిత్రలో తనకు ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న వ్యక్తి సాయిచంద్.
కుసుమ జగదీశ్ కుటుంబ, రాజకీయ నేపథ్యం : కుసుమ జగదీశ్ 1976 ఆగస్టు 28న ఆదినారాయణ, సులోచన దంపతులకు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జన్మించారు. స్వగ్రామంలోనే 10వ తరగతి వరకు చదువుకుంటూ.. ములుగు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత రమాదేవితో వివాహమై చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలినాళ్లలో పీపుల్స్ వార్ సానుభూతిపరునిగా.. తెలంగాణ జన సభలో కీలక నేతగా ఉన్నారు. ఒక అసోసియేషన్ స్థాపించి స్వగ్రామంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.
Mulugu ZP Chairman Kusuma Jagadish : ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమం సమయంలో యూత్ ఆర్గనైజేషన్‌లో చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ములుగు జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా అధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ జిల్లా అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆఖరికి 2023 ఏప్రిల్ 1వ తేదీన మొదటిసారి గుండె పోటు రావడంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇవీ చదవండి :