BRS MLA Ticket Issues Telangana 2023 : ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ఒకేసారి 115 శాసనసభ స్థానాలకు.. ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలో కొన్నిచోట్ల అసమ్మతి గళాలు స్వరం పెంచుతున్నాయి. మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కి కేటాయించడంపై.. అసమ్మతి రాజుకుంది. ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అనుచరులు.. శంకర్‌నాయక్ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Protest Against BRS MLA Tickets 2023 : బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో ఓడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి(KCR) ఓటు వేసేందుకు సిద్ధమేనని.. శంకర్‌నాయక్‌ను మార్చకుంటే పార్టీ కోసం పని చేయబోమని స్పష్టం చేశారు. మహబూబాబాద్ స్థానం నుంచి శంకర్‌నాయక్‌ను తొలగించాలని తీర్మానం చేసుకున్నారు. శంకర్‌నాయక్‌పై స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని రవీందర్‌రావు తెలిపారు.
Telangana Assembly Elections 2023 : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీరు సరిగా లేదన్న విషయాన్ని.. సీఎం కేసీఆర్ దృష్టికి రాజయ్య ద్వారా తీసుకెళ్తామని జనగామ నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్యకు.. కేసీఆర్ న్యాయంచేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. బుధవారం భారీ ర్యాలీ నిర్వహించిన కడియం శ్రీహరి(Kadiyam Srihari).. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి కనీస సమాచారం ఇవ్వలేదని వారు ఆక్షేపించారు. అసలు రాజయ్య లేకుండా.. శ్రీహరి ఎన్నికలకు ఎలా వెళ్తారో చూస్తామని వ్యాఖ్యానించారు.
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు యాదగిరిగుట్టలో డిమాండ్ చేశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానన్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడం శోచనీయమన్నారు . త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. నర్సాపూర్ నుంచి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది.
నర్సాపూర్ టికెట్ ఎవరికీ ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచగా.. ఈ తరుణంలో సునీతా లక్ష్మారెడ్డికి కాకుండా నర్సాపూర్ టికెట్‌ని మదన్‌రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు.. హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్ద నినాదాలు చేశారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు చెప్పినట్లు నేతలు వెల్లడించారు.
మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్‌ను తన కుమారుడికి ఇవ్వలేదనే ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే దిశగాఅడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దూలపల్లిలోని తన నివాసంలో.. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల ముఖ్య అనుచరులతో భేటీ నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అందరిని సంప్రదించి కీలక ప్రకటన చేస్తారని తెలిసింది.
BRS MLA Ticket Issue In Adilabad District : కారులో కుదుపులు.. ఇంతకీ వారి పయనం ఎటువైపో..!