ETV Bharat / state

కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చింది - అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలి : తలసాని

BRS MLA Srinivas Yadav Press Meet : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ జనవరి 2 నుంచి నియోజకవర్గం పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు, నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలన గురించి మాట్లాడి, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.​

Talasani Srinivas Yadav on six Guarantees
BRS MLA Srinivas Yadav Press Meet
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:56 PM IST

BRS MLA Srinivas Yadav Press Meet : వచ్చే ఏడాది జనవరి 2 నుంచి నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్​లు, మాజీ కార్పొరేటర్​లు, బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్​లలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించి, చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడం జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటామని ఆయన వివరించారు.

MLA Srinivas Yadav on Development Works : జనవరి 2న బన్సీలాల్​పేట డివిజన్​లో, 3న రాంగోపాల్​పేట డివిజన్, 4వ తేదీన సనత్​నగర్ డివిజన్​ల్లో పర్యటిస్తామని వివరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కోట్లాది రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) రావడం వలన చేపట్టిన పనులలో కొన్ని నిలిచిపోయాయని తెలిపారు. వాటిలో కొన్ని అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జనవరి 3 నుంచి బీఆర్​ఎస్​ పార్లమెంటు ఎన్నికల శంఖారావం

Talasani Srinivas Yadav on six Guarantees : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్దిని చాటుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరినందున అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్​లు, మాజీ కార్పొరేటర్​లు, బీఆర్​ఎస్​ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆదేశించారు.

MLA Srinivas yadav about Congress Manifesto : బస్తీలు, కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారికి దరఖాస్తులను అందించే విధంగా చూడాలని బీఆర్​ఎస్​ నాయకులకు ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వరకు అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు.

జనవరి 2 నుంచి ​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పర్యటన - ​ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమన్న మాజీ మంత్రి

బీఆర్​ఎస్​ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్

బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.