BRS Gongadi And Guvvala On BJP : ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు బీజేపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదని గొంగడి సునీత దుయ్యబట్టారు. దేశాన్ని బాగు చేసేందుకే తాము పక్క రాష్ట్రాలకు పోతున్నామని.. బీజేపీ యేతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ వెళ్తుందని సునీత ఆరోపించారు.
BRS Leaders Fires On BJP : బీజేపీ పాలనలో ధరలు, మతోన్మాదం బాగా పెరిగాయన్నారు. కిషన్‌రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు.. ఎంతమంది ఎంపీలు వచ్చారో కేంద్రమంత్రి చెప్పాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా కదం తొక్కుతుందని మీరు తవ్విన గుంతలో మీరే పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సాగనంపడం ఇక ఆలస్యం కాదని అనిపిస్తోందని గువ్వల తెలిపారు. రాచరిక పాలన వైపు మళ్లించే కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దేశంలోకి కేసీఆర్ ఇజం రావాలని పేర్కొన్నారు.
ఈరోజు రాష్ట్రాలు తమ రాష్ట్రం కోసం చేసిన అప్పులలో.. తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. ఆ అప్పులు కూడా కేవలం కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు పెట్టుబడికి ఉపయోగించుకోడానకి చేసిన అప్పులు మాత్రమే. ఉద్యోగాలు ఇస్తామని 9 ఏళ్ల క్రితం చెప్పారు. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు.. శ్వేతపత్రం విడుదల చేస్తారా. నీతి ఆయోగ్ కార్యాక్రమానికి కేసీఆర్ ఒక్కరే కాదు.. 10 మంది ముఖ్యమంత్రులు హాజరుకాలేదంటే మీ నీతి ఆయోగ్ సమావేశం ఎలా ఉందో తెలుస్తోంది. -గొంగిడి సునీత, ప్రభుత్వ విప్
Kishanreddy on Niti Aayog Council Meeting : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనదైన శైలిలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. దిల్లీలో జరుగుతున్న 8వ నీతి ఆయోగ్ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లకపోవడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సీఎం కేసీర్ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని విమర్శించారు.
ఇవీ చదవండి: