BRS Leaders Fires on Governor Tamilisai : నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ నేపథ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం అత్యంత దుర్మార్గం అన్న ఆయన.. ఎస్టీ, ఎంబీసీ సామాజిక వర్గాలను అగౌరవపరచినట్లేనని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచిన తమిళిసై.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ నేరుగా గవర్నర్‌గా నియామకం కాలేదా అని ప్రశ్నించారు.
Harishrao Fires On Governor : 'గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది'
Prashanth Reddy Comments on Governor Tamilisai : సర్కారియా కమిషన్ సిఫారసు ప్రకారం రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యానించారని ప్రశాంత్‌రెడ్డి గుర్తు చేశారు. వాటిని తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారని ఆక్షేపించారు. మంత్రిమండలి సిఫారసు చేసిన పేర్లను తిరస్కరించడం ఏ మేరకు సబబని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు ఉంటే.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
గవర్నర్ రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా చూస్తున్నారు: కవిత ట్వీట్
Minister Indrakaran Fires on Governor Decision : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని.. గతంలో ఏ గవర్నర్ ఇలా చేయలేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కవులు, కళాకారులు, సేవ చేసే వారికి.. గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారని తెలిపారు. కానీ కేసీఆర్ క్రిమినల్ కేసులున్న వ్యక్తులను నియమించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి పని చేసే వారికి ఎమ్మెల్సీ అడుగుతున్నారని.. పార్టీలు ఫిరాయించిన వారు, కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని గవర్నర్ రిజెక్ట్ చేయడం మంచి నిర్ణయమని స్పష్టం చేశారు.
గవర్నర్ వ్యవస్థలో కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదు: సత్యవతి
ఈ క్రమంలోనే సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు ప్రధాని మోదీ ఎంపీగా అవకాశం కల్పించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయనతో పాటు పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేశారని తెలిపారు. బీజేపీకి సంబంధం లేని వ్యక్తిని మోదీ నామినేట్ చేశారన్న ఆయన.. తమిళిసై గవర్నర్‌గా వ్యవహరించారు కాబట్టే.. ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేశారన్నారు.