ETV Bharat / state

'సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్రం చర్యలు.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు' - తలసాని తాజా వార్తలు

BRS Agitations Against Gas Prices Hike: గ్యాస్‌ బండ ధరల పెంపుపై రెండోరోజూ బీఆర్​ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సామాన్యుడి నడ్డివిరిచేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆక్షేపించిన నేతలు.. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. గ్యాస్‌బండలు, కట్టెల మోపుతో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని నినదించారు. రాయితీ పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా గ్యాస్‌ పేదలకు భారంగా మార్చుతున్నారని ఆరోపించారు.

BRS Agitations
BRS Agitations
author img

By

Published : Mar 3, 2023, 4:16 PM IST

BRS Agitations Against Gas Prices Hike: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ బీఆర్​ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కట్టెల పొయ్యి, గ్యాస్ బండలు, రోడ్లపై వంటావార్పుతో కేంద్రానికి సెగ తగిలేలా నిరసన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయం ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ప్రజలు, మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.

సొమ్మునంతా గుజరాతీలకు దోచిపెట్టారు: దేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతీలకు దోచిపెట్టారని మరో మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్​లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ప్రపంచ మార్కెట్​లో క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడూ... ఇప్పుడూ 100 డాలర్లేనన్నారు. అటువంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమెంటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

దున్నపోతుకు వినతి పత్రం: శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో నిరసనలో పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి టీ కాచారు. హైదరాబాద్‌ నల్లకుంటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. బోరబండ చౌరస్తా వద్ద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మాసబ్​ట్యాంక్ కూడలి వద్ద ఎమ్మెల్సీ ప్రభాకర్​తో పాటు, స్థానిక నేతలు నిరసనలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా సాగర్ రహదారిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు ధర్నా నిర్వహించారు.

ధరలను తగ్గించేవరకూ పోరు ఆగదు: బీజేపీ అంటే ప్రజలను పీడించే పార్టీ అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ధర్నా చేపట్టారు. 365వ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి.. వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్యాస్, చమురు ధరలను తగ్గించడం.. ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి ధరలు పెంచడమేంటని ధ్వజమెత్తారు. వరంగల్‌లో గ్యాస్ సిలిండర్‌కు ఉరితాడు బిగించి, నిరసన ర్యాలీ నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదురుగా ఛీప్ విప్​ వినయ్ భాస్కర్​ ఆధ్వర్యంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెంచిన ధరలను తగ్గించేవరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

BRS dharna
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.