ETV Bharat / state

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

BRS Incharges For 54 Constituencies Telangana 2023 : ఎన్నికల ప్రచారం మరింత ప్రణాళికబద్ధంగా నిర్వహించేందుకు వీలుగా.. నియోజకవర్గాల ఇంcర్జిలను బీఆర్​ఎస్​ నియమించింది. తొలి విడతలో 54 నియోజకవర్గాలల్లో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు మంత్రులనూ ఇంఛార్జిలుగా నియమించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్.. గజ్వేజ్‌లో హరీశ్‌రావు పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉందని.. పార్టీ శ్రేణులను సమన్వయం చేసి బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని ఇంఛార్జిలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

Harish Rao Given Instructions to MLAs
BRS campaign Arrangements
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 7:12 AM IST

BRS Incharges For 54 Constituencies 54 నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ ఇంBRS Appointed Incharges in 54 Constituencies ర్జిలు

BRS Incharges For 54 Constituencies Telangana 2023 : అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలోనూ దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించింది. నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించింది. తొలి విడతలో 54 నియోజకవర్గాల(54 constituencies)కు ఇంఛార్జిలను నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులనూ ఇంఛార్జిలుగా నియమించారు. అభ్యర్థులకు తోడుగా ఉంటూ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రచారం ప్రణాళికబద్ధంగా జరిగేలా ఇంచార్జిలు పనిచేయాలని బీఆర్​ఎస్​ నాయకత్వం దిశా నిర్దేశించింది.

BRS Election Strategy 2023 : కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్‌తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఇంఛార్జిగా వ్యవహరిస్తారు. గజ్వేల్ పర్యవేక్షణ బాధ్యతలు హరీశ్​ రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలకు అప్పగించారు. ఎస్సీ నియోజకవర్గాలైన కంటోన్మెంట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చొప్పదండికి గంగుల కమలాకర్, మధిరకు పువ్వాడ అజయ్‌ను ఇంఛార్జిలుగా నియమించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ మహబూబాబాద్ నియోజకవర్గం బాధ్యతలు చూస్తారు. ఎమ్మెల్సీ కవిత బోధన్‌, నిజామాబాద్ అర్బన్‌కు ఇంఛార్జిగా వ్యవహరిస్తారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

BRS Appointed Incharges in 54 Constituencies : పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముందుగా 54 నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులను నియమిస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై వారితో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. బీఆర్​ఎస్​ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమవ్వాలని.. ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు(Election Result) వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతలను వారు తీసుకోవాలని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ శ్రేణులన్నింటినీ సమన్వయం చేసుకొని ప్రచార బాధ్యతలను నిర్వహించాలని సూచించారు.

Harish Rao Instructions to MLAs : టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పార్టీ ఇంఛార్జులకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీల నిర్వహణ మొదలుకొని, నియోజకవర్గ స్థాయి వరకు అన్నిదశల్లో పకడ్బందీగా ప్రచారం ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. కార్యక్షేత్రంలో గత పదేళ్లలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఆ దిశగా ఈ 45 రోజుల పాటు కార్యోన్ముఖులై పనిచేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

BRS Aiming for Hattrick Telangana 2023 : ఓవైపు హ్యాట్రిక్​పై కేసీఆర్ ఫోకస్​.. మరోవైపు మహబూబ్​నగర్​లో మూడోసారి గెలుపుపై కన్నేసిన ఎమ్మెల్యేలు

Khammam BRS Disputes : ఖమ్మం జిల్లాలో వర్గపోరు.. అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న అసంతృప్తులు.. రంగంలోకి దిగిన ముఖ్యనేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.