BRS Focus on Parliament Elections 2024 : వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇక ఆయన పార్టీ కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.
KCR Focus on Lok Sabha Elections 2024 : ఇందులో భాగంగానే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం వెంటనే దిల్లీ నుంచి బీఆర్ఎస్ ఎంపీలంతా హైదరాబాద్ రావాలని ఆయన ఆదేశించారు. నగరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా లోక్‌సభ సభ్యులతో ఆయన విడివిడిగా సమావేశమై, చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆయన లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎలాంటి వారిని బరిలో దింపాలి అనే అంశాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటక సీఎం వీడియోపై కేటీఆర్ ట్వీట్ - తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సిద్ధరామయ్య
కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే శాసనసభలోనూ చెప్పారు : హరీశ్‌రావు