BRS Ex MLA Shakeel Son Accident Case Update : బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అయితే షకీల్ కుమారుడు ముంబయి నుంచి దుబాయికి వెళ్లినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.
Lookout Notices for BRS Ex MLA Shakeel Son : నిందితుడిని నగరానికి రప్పించేందుకు పంజాగుట్ట పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన కారులో ప్రయాణిస్తూ ఢీకొట్టగా, పంజాగుట్ట పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
అసలు ఆ రాత్రి ఇదీ జరిగింది : ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కారు ఢీకొట్టింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. కారు సాహిల్దేనని, నడిపింది కూడా అతనేనని గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతనిని పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. తండ్రి షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. సాహిల్‌ను కేసు నుంచి తప్పించి, అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన : ఇదిలా ఉండగా, బ్రీత్ ఎనలైజ్ టెస్ట్‌కు తీసుకెళ్తున్న టైమ్‌లో సాహిల్ పారిపోయాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేశారు. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. అలాగే స్టేషన్‌లోని కెమెరాల్లో సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు.
నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సాహిల్‌ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీకి అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్‌కాంత్ ఉన్నట్లు ఆయన గుర్తించారు. విచారణ చేస్తున్న సమయంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా, అతన్ని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
ఏ1గా సాహిల్, ఏ2గా అబ్దుల్ : నిందితులను కోర్టులో హాజరుపరిచే టైమ్‌లో సాహిల్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా సాహిల్‌ను, ఏ2గా అబ్దుల్‌ను చేర్చినట్లు వెల్లడించారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశామని , బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. సాహిల్ పరారీలో ఉన్నాడని, మిగిలినవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని డీసీపీ వివరించారు.
కారును ఢీకొట్టి టోల్‌ప్లాజా క్యాబిన్లోకి దూసుకెళ్లిన లారీ
చెరువులోకి దూసుకెళ్లిన కారు - ప్రాణాలతో బయటపడిన నలుగురు, ఒకరి దుర్మరణం