BRS Campaign in Telangana 2023 : కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులు, గుజరాత్ నుంచి బీజేపీ నేతలు డబ్బు మూటలతో వస్తున్నారని.. వారి కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. దుబ్బాక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్‌లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ (Minister KTR).. హస్తం పార్టీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమవుతుందని అన్నారు.
"ఈ ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుంది. ఎవరి చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలి. మోసగాళ్లు చెబుతోంది నమ్మొద్దు. మీ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడండి. బాగా ఆలోచించి ఓటు వేయండి. ఆగమై ఎవరికో ఓటు వేయద్దు." - కేటీఆర్, మంత్రి, బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు
BRS Aiming For Hattrick Win in Telangana 2023 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి.. మెచ్చా నాగేశ్వరరావు ప్రచారం చేపట్టారు. పినపాక మండలంలో రేగా కాంతారావు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. ములుగు జిల్లా మల్లంపల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బడే నాగజ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్
భూపాలపల్లి, పరకాలలో జరిగిన ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళానానికి.. హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali), మాజీ మంత్రి బసవరాజు సారయ్య హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వారు కోరారు. వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. సిద్దిపేట జిల్లా మనోహరాబాద్ మండలంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా.. బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని మోపాల్ మండలంలో గులాబీ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
Telangana Assembly Elections 2023 : నిజామాబాద్ జిల్లా మోస్ర మండలంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. బోధన్ అభ్యర్థి షకీల్ రెంజల్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంత్రి గంగుల కమలాకర్.. ఎన్నికల ప్రచారం చేశారు. అవినీతి సొమ్ముతో బండి సంజయ్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని.. ఆయనకు బుద్ధిచెప్పాలని గంగుల కోరారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి.. పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పుట్ట మధు ఇంటింటికి వెళ్తూ, తనను గెలిపించాలని కోరారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి.. నర్సాపూర్ మండలంలోని గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మద్దతుగా.. పట్టణంలో మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) రోడ్ షో నిర్వహించారు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని హరీశ్‌రావు కోరారు.
"బీజేపీ వాళ్లు బోరుబావి వద్ద మీటర్లు పెట్టండి. రైతుల ఇంటికి బిల్లు పంపడని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు 3 గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారు. మరీ మా ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుంది. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి." - హరీశ్ రావు, మంత్రి
Telangana Assembly Elections Campaign 2023 : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ (BRS Election Campaign) అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి... నేరెడ్‌మెట్‌లో బిల్డర్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండి పరిధిలోని పలు బస్తీల్లో పాదయాత్ర చేస్తూ.. ఉపసభాపతి పద్మారావు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. తుర్కయంజాల్ పురపాలిక పరిధిలో రోడ్ షోలు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
మూడోసారి గెలుపై లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార జోరు - ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థనలు