కొవిడ్‌పై పోరుకు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు కొనసాగుతున్నాయి. బ్రోడ్ రిడ్జ్ ఇండియా తరుఫున కంపెనీ ఎండీ లక్ష్మీ కాంత్ వెంకటరత్నం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి సీఎం సహాయనిధికి 50 లక్షల రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
క్రికెటర్ యువరాజ్‌కు చెందిన యూవీకెన్ ఫౌండెషన్తో పాటు.. పేటీఎం, లైఫ్ బాయ్ కంపెనీలు కలిపి లక్షకు పైగా హైజీన్ ప్రొడక్టులను ఆరోగ్య, పోలీస్ శాఖకు అందజేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
- ఇదీ చూడండి : హైకోర్టులో పిటిషన్.. రూ.50 వేలు జరిమానా