మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పోరాడుతున్న.. పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటీష్ హై కమిషనర్ ఎల్లిస్ తెలిపారు. హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. విభాగం పని తీరును కొనియాడుతూ.. మహిళలు, పిల్లల భద్రత కోసం చేపడుతోన్న పలు కార్యక్రమాల గురించి వారినడిగి తెలుసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఆన్ లైన్ సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి.. మానవ అక్రమ రవాణా అనేది అతి హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాన్ని నివారించడానికి కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: తమిళ బరిలో తెలుగు వెలుగులు!