ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ... ఆయా జిల్లాల పాలనాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం వాల్మీకి కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కేంద్ర మంత్రి జావడేకర్కు ఫిర్యాదు చేశారు. సినిమా టైటిల్‌తో పాటు వరుణ్‌తేజ్ వాల్మీకి పేరుతో గన్నులు పట్టుకుని ఉండటంపై ఆ సంఘం నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా సినిమాను నిలుపుదల చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదలైనా... కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండీ... 'సీబీఐని అప్పడు వద్దన్నారు... ఇప్పుడు ఎందుకు..?'