High Range Book Of World Record: హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ.. దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేంద్కర్ విగ్రహం నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమర్పించారు.
హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం అభినందనీయమని మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ర్ట ప్రభుత్వానికి అభినందనలు చెపుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ టూరిజం స్పాట్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందుకు విమర్శలా: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం అవిష్కరించుకున్న సందర్భంగా బండి చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు. తనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.
టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో పట్టపగలు పట్టుబడిన దొంగ బండి సంజయ్ అని.. దళితుల జనోర్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక అర్హత అయనకు లేదన్నారు. తెలంగాణ సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా లేక.. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నకు విమర్శిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌పైన.. తెలంగాణ సర్కార్పైన చేసిన విమర్శలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. లేకపోతే ప్రజలే సమాధానం చెపుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.
-
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణను జీర్ణించుకోలేక, సీఎం కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక @bandisanjay_bjp పిచ్చి విమర్శలు,
— KoppulaEshwarBRS (@Koppulaeshwar1) April 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
సచివాలయం భవనంకి అంబేద్కర్ పేరు పెట్టినందుకా లేక నూతన పార్లమెంట్ భవనంకి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకా విమర్శలు @bandisanjay_bjp చెప్పాలి pic.twitter.com/n4VUfBGMYl
">125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణను జీర్ణించుకోలేక, సీఎం కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక @bandisanjay_bjp పిచ్చి విమర్శలు,
— KoppulaEshwarBRS (@Koppulaeshwar1) April 15, 2023
సచివాలయం భవనంకి అంబేద్కర్ పేరు పెట్టినందుకా లేక నూతన పార్లమెంట్ భవనంకి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకా విమర్శలు @bandisanjay_bjp చెప్పాలి pic.twitter.com/n4VUfBGMYl125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణను జీర్ణించుకోలేక, సీఎం కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక @bandisanjay_bjp పిచ్చి విమర్శలు,
— KoppulaEshwarBRS (@Koppulaeshwar1) April 15, 2023
సచివాలయం భవనంకి అంబేద్కర్ పేరు పెట్టినందుకా లేక నూతన పార్లమెంట్ భవనంకి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకా విమర్శలు @bandisanjay_bjp చెప్పాలి pic.twitter.com/n4VUfBGMYl