ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమన్న బాక్సర్ హుసాముద్దీన్ - ETV Bharat Interview with Boxer Husamuddin
Husamuddin On Olympics: అతడు బరిలోకి దిగితే పంచ్ పడాల్సిందే. పతకం రావాల్సిందే. బాక్సింగ్‌లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు ఆ యువకుడు. సోదరుల స్ఫూర్తితో.. తండ్రి శిక్షణతో రాటుదేలాడు. అతడే నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ బాక్సర్ హుసాముద్దీన్. ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్యాలు సాధించి ఎన్నో వేదికలపై దేశ పతాకాన్ని రెపరెపలాడించాడు. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యమని చెబుతున్న యువ బాక్సర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
బాక్సర్ హుసాముద్దీన్