book fair at hyderabad: గత సంవత్సరం నిర్వహించిన పుస్తక మహోత్సవానికి 11 రోజుల్లో పది లక్షల మంది హాజరయ్యారని నిర్వహకులు తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పబ్లికేషన్ వారితో పాటు, పుస్తక ప్రియులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సారి పుస్తక మహోత్సవానికి మరింత ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పుస్తక మహోత్సవంలో అనేక కార్యక్రమాల నిర్వహణ కూడా చేపట్టారు. 23వ తేదీన 2.45గంటల నుంచి 3 గంటల వరకు పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, 24వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పప్పెట్ షో, 25వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫ్లాష్ మాబ్, 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు పాటల పోటీలు, 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు డ్యాన్స్ పోటీలు, 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 గంటల వరకు డ్యాన్స్ పోటీలు, 30వ తేదీన సాయంత్రం 4.15 గంటల నుంచి 5గంటల వరకు కథల పోటీలు, 31వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి 2.45 గంటల వరకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: