ETV Bharat / state

Bolo english: 'బోలో ఇంగ్లీష్​తో పేద విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం'

పేద విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేందుకు 'బోలో ఇంగ్లీష్​' దోహదపడుతుందని ఆ ప్రాజెక్టు డైరెక్టర్​ రోహన్​ జోషి పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల ద్వారా మొబైల్​ యాప్​ అనుసంధానంతో చిన్నారులకు ఉచితంగా ఇంగ్లీషు నేర్పిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

bolo english project
బోలో ఇంగ్లీషు ప్రాజెక్టు
author img

By

Published : Jul 28, 2021, 5:09 PM IST

పేద వర్గాల చిన్నారుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంచేందుకు రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాల నిర్వహణ సంఘం 'బోలో ఇంగ్లీష్' ప్రాజెక్టుతో జతకట్టింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో బోలో ఇంగ్లీషు డైరెక్టర్ రోహన్ జోషి, టీఆర్ఎస్ఎం అధ్యక్షుడు శేఖరరావు సహా పలువురు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో బోలో ఇంగ్లీష్ ప్రాజెక్టు పనిచేస్తోందని.. చిన్న, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు డైరెక్టర్ రోహన్ తెలిపారు.

పలు రాష్ట్రాల్లో ఉచితంగా

ఇటీవల మాతృభాషలో ప్రాథమిక విద్య తర్వాత ఆంగ్లమాధ్యమంలోకి వచ్చాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను గమనించామని.. అలాంటివారిని ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడించేలా చేస్తామని రోహన్​ చెప్పారు. సంబంధిత పాఠశాలల ద్వారా మొబైల్ యాప్ అనుసంధానంతో చిన్నారులకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించనున్నట్లు రోహన్ వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు నేర్పుతున్నామని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్​లోనూ ప్రారంభించనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో 125 బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల ద్వారా 30వేల మంది విద్యార్థులు, 600 మంది అధ్యాపకులకు బోలో ఇంగ్లీష్​తో శిక్షణ ఇస్తున్నామని.. రాష్ట్రంలో మొత్తం 350కి పైగా పాఠశాలలు ఈ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని టీఆర్ఎస్ఎం అధ్యక్షుడు శేఖర్ రావు తెలిపారు.

ఇదీ చదవండి: Harish rao: మన పథకాలు వారి రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? :హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.