ETV Bharat / state

'పశుసంపద గణనకు డిజిటల్​ టెక్నాలజీ అమలు ఉత్తమం'

రాష్ట్రంలో పశుసంపదను గణించేందుకు డిజిటల్ టెక్నాలజీని అమలు చేయడం ఉత్తమమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. జియోస్టాట్ ఇన్​ఫార్మటిక్స్​ సంస్థ ఎండీ వివేక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వినోద్ కుమార్​కు ఈ టెక్నాలజీని వివరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీనిచ్చారు.

boinapally vinod kumar spoke on animal insurance
'పశుసంపదను గణించేందుకు డిజిటల్​ టెక్నాలజీ అమలుచేయడం ఉత్తమం'
author img

By

Published : Jul 19, 2020, 9:29 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను గణించడానికి జంతువుల ముక్కు ముద్రణాలను 'డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం' ద్వారా సేకరించి ఆన్​లైన్​లో పొందపర్చవచ్చునని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంత్రుల నివాసంలో మల్కాజిగిరి పార్లమెంట్​ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి జియోస్టాట్ ఇన్​ఫార్మటిక్స్​ సంస్థ ఎండీ వివేక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వినోద్ కుమార్​కు ఈ టెక్నాలజీని వివరించారు. మనుషుల వేలిముద్రలు ఏ విధంగా అయితే ఒకదానికొకటి పోలిక ఉండదో.. అదే విధంగా జంతువుల ముక్కు ముద్రలు ఒకేలా ఉండవని వివేక్​రెడ్డి తెలిపారు. జంతువుల ముక్కును ఫొటో తీసి డిజిటలైజ్ చేయడం ద్వారా వాటి పక్కా రికార్డ్ అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ డిజిటల్ పద్దతి ద్వారా సంప్రదాయ పద్దతి ఇయర్​ టాగింగ్​కు స్వస్తి చెప్పవచ్చునని వెల్లడించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో బీమా సంస్థలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో కూడా ఈ టెక్నాలజీని పశుసంపద అభివృద్ధి కొరకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల చెవులకు జియో ట్యాపింగ్ చిప్ ఉన్నా.. కొందరు ఆ చెవులను కోసేసి బ్లాక్ మార్కెట్​కు తరలిస్తున్నారు. ముక్కు ఫొటో తీసే కొత్త టెక్నాలజీ తో దానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని వివేక్​రెడ్డి వివరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీనిచ్చారు.

ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.