ETV Bharat / state

వాతావరణ సమాచారం కోసం ప్రత్యేక యాప్​ - mobile app

టీఎస్ - వెదర్ మొబైల్ యాప్, పోస్టర్స్​ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్ యాప్​ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

boinapally vinod kumar inaugurated weather app in hyderabad
వాతావరణ సమాచారం కోసం ప్రత్యేక యాప్​
author img

By

Published : Jun 19, 2020, 3:50 PM IST

వాతావరణ సమాచారం, వర్ష సూచన తదితర వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్​ను అందుబాటులో తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంస్థ-టీఎస్డీపీఎస్ రూపొందించిన టీఎస్ వెదర్ యాప్​ను, పోస్టర్స్​ను ఆయన ఆవిష్కరించారు.

రైతులు, ప్రజలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరమన్న వినోద్... వాతావరణ పరిస్థితులు, సూచనలతో రైతులు వ్యవసాయ పనులు, ప్రజలు ప్రయాణాలను కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వివరాలైనా అరచేతిలో క్షణాల్లో అందించేలా యాప్​ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్​పై హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.