ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో నాలుగోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 38 మృతదేహాలు లభించాయి. బోటు మునిగిన ప్రాంతానికి సమీపంలోనే దేవీపట్నం వద్ద ఈ ఉదయం 6 మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. వీటిని ఒడ్డుకు చేర్చిన అధికారులు అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి తరలించారు. గల్లంతైన మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు..బోటు ప్రమాదంలో చనిపోయిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమహేంద్రవరం నుంచి కుటుంబసభ్యులు ఇద్దరి మృతదేహాలు హైదరాబాద్ తరలించారు.
సంఖ్య | పేరు | స్వస్థలం |
1 | మహేశ్వర్‌రెడ్డి | నంద్యాల, కర్నూలు జిల్లా |
2 | రాజేంద్రప్రసాద్ | కడిపికొండ, వరంగల్ అర్బన్ జిల్లా |
3 | శ్రీనివాసరావు | పెదపాడు, పశ్చిమ గోదావరి జిల్లా |
4 | మహమ్మద్ తాలిబ్ పటేల్ | టోలీచౌకీ, హైదరాబాద్ జిల్లా |
5 | దాలమ్మ | అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా |
6 | హేమంత్‌కుమార్ | వరంగల్ |
ఇదీ చదవండిః కేంద్రం నుంచి త్వరలోనే భారీ ఉద్దీపన ప్యాకేజీ!