రాష్ట్ర భాజపా అధ్యక్షుడి గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియామకంపై సికింద్రాబాద్ హస్మత్ పేట్లో బీజేవైఎం ప్రెసిడెంట్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిపు పంచారు. కమలం పార్టీలో కుల రాజకీయాలకు తావులేదని, లాబీయింగ్ ఉండదని, కష్టపడితే ఎవరు ఆపినా పదవులు ఆగవని ప్రకాశ్ అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నగర మేయర్ పదవి కొట్టి భాజపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంజయ్‌ను కోరుతున్నామని ప్రకాష్ తెలిపారు.
ఇవీ చూడండి: 'పారాసెటమాల్తోనే కరోనాకు చికిత్స!'