ETV Bharat / state

BJP's Strategic Steps on the Candidates List : అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడేం తొందర.. వచ్చేనెలంతా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ హైకమాండ్ ఆదేశం - BJP New Strategy on Candidates

BJP's Strategic Steps on the Candidates List : అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లు ఖరారుపై బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తొందరపడి అభ్యర్థుల ప్రకటన చేయడం వృధా అని భావిస్తోంది. నేతలు నియోజకవర్గాలకే పరిమితమైతే నష్టమని అంచనా వేసిన బీజేపీ అధినాయకత్వం... సెప్టెంబరు నెలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది.

BJPStrategic Steps
BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:53 AM IST

Updated : Aug 30, 2023, 10:47 AM IST

BJPs Strategic Steps on the Candidates List అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడేం తొందర వచ్చేనెలంతా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ హైకమాండ్ ఆదేశం

BJP's Strategic Steps on the Telangana Candidates List : శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ అధిష్ఠానం (BJP Highcommand) నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరు నాటికి మూడోవంతు మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేసినా ఇప్పుడు ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్(BRS) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌(Congress) ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. బీజేపీ మాత్రం తొందరపాటు లేకుండా వ్యవహరించాలని నిర్ణయించింది.

BJP Leaders on Telangana Election : పార్టీ ముఖ్యనేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాల్సి ఉంటుందని జాతీయ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. ఇలాంటివారు సుమారు 30 మంది ఉన్నారు. వీరి అభ్యర్థిత్వాలను ఇప్పుడే ప్రకటిస్తే.. వారంతా తమ నియోజకవర్గాలకే పరిమితమై.. ఇతర ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ సన్నగిల్లే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికలకు మూడు నెలలకు పైగా సమయం ఉన్నందున.. ముందుగానే అభ్యర్థుల ప్రకటనతో వ్యయం భారీగా పెరగడం వంటి సమస్యలు తప్ప.. ఇతరత్రా సానుకూలతలు తక్కువేనని కొందరు ముఖ్యనేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు.

BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో .. బీజేపీ బస్సు యాత్ర

BJP New Strategy on Candidates : బీఆర్​ఎస్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి.. ప్రత్యర్థులను ఉచ్చులో పడేసేందుకు ప్రయత్నించిందని అందులో చిక్కుకోవద్దని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah ) ఇటీవల ఖమ్మంలో పార్టీ నేతలతో సమావేశమైనపుడు కూడా.. తొందరపడి ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరంలేదని, పార్టీ నిర్దేశిత కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.

JP Nadda on Telangana Elections : సరైన సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తామని, వారిని గుర్తించే ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 19 SC రిజర్వుడ్‌ స్థానాలు, 12 ST రిజర్వుడ్‌ స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. వీటిలో బలమైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా తగిన వారిని బరిలోకి దించాలని యోచిస్తోంది. కీలకమైన స్థానాల్లో కనీసం ఇద్దరు బలమైన అభ్యర్థులను గుర్తించనున్నారు. ఇతర పార్టీల నుంచి చేరిన, చేరనున్న వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు.

BJP Protests at Collectorates in Telangana : 'డబుల్​' ఆందోళనలు ఉద్ధృతం చేసిన బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

అభ్యర్థుల కొరతపై దృష్టి : ఇప్పటికే పలువురు నేతలు అభ్యర్థిత్వాల కోసం ప్రయత్నిస్తుండగా.. వేచి ఉండాలని రాష్ట్ర నాయకులు వారిస్తున్నారు. కొన్నిచోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీపడుతుండగా.. మరికొన్నిచోట్ల బలమైన అభ్యర్థుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది.. సెప్టెంబరు నెలాఖరు వరకు పార్టీ నేతలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించారు. అధికార బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించారు.

ఎల్లుండి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ముఖ్యనేతలకు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశించింది. అభ్యర్థుల ఎంపిక సరైనా సమయంలోనే ఉంటుందని.. ఇదే విషయాన్ని దిగువ శ్రేణి నేతలు, కార్యకర్తలకు చెప్పాలని సూచించారు. ముందుగా నేతల గుర్తింపు, ప్రత్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది.

BJP Comments on BRS MLA Candidates 2023 : 'దమ్ముంటే ఈటలపై పోటీ చేయ్.. కేసీఆర్'

BJP Strategy Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. బీజేపీ వర్క్ షాప్స్.. బస్సు యాత్రలు

Last Updated : Aug 30, 2023, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.