ETV Bharat / state

బల్దియాలో భాజపా జోరు... 2023 లక్ష్యంగా కమలనాథుల పావులు - జీహెచ్ఎంసీ పోల్స్

తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా... బల్దియా ఫలితాల ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపించింది. దుబ్బాక ఉపఎన్నిక గెలుపు తర్వాత పక్కావ్యూహాంతో జీహెచ్ఎంసీలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. కేంద్ర హోంమంత్రి, పార్టీ కీలక నేత అమిత్ షా దిశానిర్దేశంతో కమలనాథులు మెరుగైన స్థానాలను కైవసం చేసుకున్నారు. ఫలితాలు ఇచ్చిన జోష్‌తో 2023లో అధికార పీఠంపై పాగావేయడమే ధ్యేయంగా కమలదళం పావులు కదుపుతోంది.

బల్దియాలో భాజపా జోరు... 2023 లక్ష్యంగా కమలనాథుల పావులు

author img

By

Published : Dec 5, 2020, 5:20 AM IST

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెట్టింది. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొందిన భాజపా... రాష్ట్రంలో పట్టుసాధించేందుకు అప్పటినుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైనా... తెలంగాణలో ఎలాగైనా పట్టుసాధించేందుకు శ్రమిస్తూనే ఉన్నారు.

తెరాసకు సవాల్...

ఈ క్రమంలోనే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి భవిష్యత్‌ ఆశలను పదిలం చేసుకున్నారు. ఈ ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు తమ వ్యూహాలను పక్కాగా అమలు చేశారు. అనూహ్యరీతిలో బల్దియాలో దూసుకొచ్చారు. 149 స్థానాల్లో పోటీచేసి 48 స్థానాల్లో విజయం సాధించి... అధికార తెరాసకు సవాల్ విసిరారు. తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ స్పష్టమైన సంకేతాలు పంపించారు.

దక్షిణాదిపై దృష్టి...

ఉత్తరాదిలో ప్రాబల్యం పెంచుకున్న భాజపా... ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటక భాజపా వశం కాగా... ఆ తరువాత అవకాశం తెలంగాణలో ఉందని పార్టీ అగ్రనేతలు గుర్తించారు. ఈదిశగానే తెలంగాణలో పాగా వేయడానికి 2019 సాధారణ ఎన్నికలకు ముందే వ్యూహాలను రచించారు.

4 నుంచి 48...

ఆ తరువాత అవకాశం వచ్చిన ప్రతీసారి భాజపా తమ ప్రాబల్యం పెంచుకుంది. అదే స్థాయిలో సంఘ్ పరివార్‌ను బలోపేతం చేసింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రణాళికలు అమలు చేసి... ఇప్పుడు బల్దియాలో 48 స్థానాలకు చేరింది. 2016లో ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన భాజపా...ఇప్పుడు ఏకంగా 48చోట్ల గెలుపొందింది.

ప్రణాళికల అమలు...

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే... భాజపా తన ప్రణాళికలు అమలు చేసేంది. ఇటీవల బిహార్ సాధారణ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను గ్రేటర్ ఎన్నికల్లో ఇంఛార్జిగా నియమించింది. అప్పటినుంచి పోలింగ్ వరకు భాజపా తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

నువ్వా-నేనా...

సుమారు 74 లక్షల మంది ఓటర్లున్న హైదరాబాద్‌లో... పక్కాగా పోల్ మేనేజ్‌మెంట్ చేసింది. ఆ ప్రణాళికలే భాజపాను గ్రేటర్‌లో ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మేయర్ పీఠం తీసుకురాలేకపోయినా... అధికార పార్టీతో నువ్వా-నేనా అనే వరకు తీసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధికార పక్షానికి ధీటుగా ప్రచార వ్యూహాలు అమలుజేశారు. కలిసొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను స్వమన్వయం చేసుకుంటూ కమలదళంలో నూతనోత్తేజాన్ని నింపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం... పార్టీ తనకు అప్పగించిన పనిని పక్కాగా చేసి తనదైన ముద్రవేసుకున్నారు.

లక్ష్యం 2023...

గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రాబల్యం పెంచుకోవటంతో భాజపా తెలంగాణలోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు సందేశం ఇవ్వాలని పనిచేసినట్టు స్పష్టంగా కనిపించింది. తాము పనిచేసేది కేవలం గ్రేటర్ ఎన్నికలకు కాదు.. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలకు అనేది చెప్పాలనుకుంది. అందుకే క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలకు పదునుపెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ.. ముఖ్యంగా తెలంగాణలో తమ బలం పెరిగింది అని నిరూపించుకుంది. అమిత్‌షా.. తాను అనుకున్న ప్రతీ ప్రణాళికను పక్కాగా అమలు చేయడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

ప్రత్యామ్నాయం భాజపానే...

ఏది ఏమైనా.. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని నిరూపించిందని... రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విజయం... భాజపా కార్యకర్తల్లోనూ జోష్ నింపింది. ఇదే ఊపుతో సార్వత్రికసమరంలోనూ సత్తా చాటే వ్యూహాలతో కమలనాథులు ముందుకుసాగుతున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.