జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా భాజపా అభ్యర్థి ఉష శ్రీ.. ఈ రోజు మల్లేపల్లి డివిజన్లోని మాంగారు బస్తీలో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ఎంఐఎం కార్పొరేటర్.. డివిజన్లోని సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈసారి కచ్చితంగా విజయం భాజపాకే సొంతమవుతుందని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'భాజపాను గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తాం'