ETV Bharat / state

BJP, Telangana Election Results 2023 Live : తెలంగాణలో 8 స్థానాల్లో బీజేపీ గెలుపు - కీలక నేతలకు దక్కని విజయం

BJP, Telangana Election Results 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లను పెంచుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చింది. కానీ ఈ పార్టీ కీలక నేతలు ఓడిపోవడం మాత్రం ఆ పార్టీకి మింగుడు పడని విషయమని చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్ర నాయకత్వం ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. ఈ ఫలితాలు కొంత ఊరటను కలిగించాయి.

BJP in Telangana assembly election 2023
Telangana assembly election results 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 3:18 PM IST

Updated : Dec 3, 2023, 6:11 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

BJP, Telangana Election Results 2023 Live : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని (Telangana Election Results 2023) హోరెత్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రధాని ఏకంగా 5 సార్లు రాష్ట్రానికి వచ్చి 8 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు.

BJP Top Leaders Loss Constituencies : 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్ర నాయకత్వం సుడిగాలి పర్యటనలతో, ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. అగ్రనేతల ప్రచారం బీజేపీ ఓట్ల శాతం పెరుగుదలకు దోహదం చేసింది. పాతబస్తీలోని బహుదూర్​పురా, చార్మినార్, కార్వాన్, యాకత్​పురా, మహేశ్వరం, సిర్పూర్, నిజామాబాద్ అర్బన్, గజ్వేల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, గోషామహల్, ముధోల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హోరాహోరీగా పోటీనిస్తూ వచ్చింది. రౌండ్ రౌండ్​కు ముందంజ, వెనకంజకు వెళ్తూ ఉత్కంఠను కలిగించింది.

భోపాల్ పీఠం మళ్లీ బీజేపీదే! కాంగ్రెస్​పై స్పష్టమైన ఆధిక్యంలో కమలదళం

Telangana Assembly Results 2023 : ఈ క్రమంలోనే కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్​పై, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. సీఎంపై ఆయన 5,810 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండో స్థానంలో కేసీఆర్‌, మూడో స్థానంలో రేవంత్​ రెడ్డి నిలిచారు. అదే విధంగా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డిపై, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి విజయం సాధించారు. ఆదిలాబాద్‌ నుంచి శంకర్‌, నిజామాబాద్‌ అర్బన్‌లో సూర్యనారాయణ, ఆర్మూర్‌లో రాకేశ్​రెడ్డి, ముధోల్​లో రామారావు పవార్, సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్‌ గెలుపొందారు.

మరోవైపు కమలం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలైన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్​లలో.. రాజాసింగ్ గెలవగా, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పరాజయం పాల్యయారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్​లో ఓటమి చెందారు. ముఖ్యమంత్రిపై గజ్వేల్​లో పోటీ చేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఈటల రాజేందర్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఒంటెద్దు పోకడలు దీనికి కారణాలుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముగ్గురు ఎంపీల ఓటమి : ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పరాజయం పాలయ్యారు. సోయం బాపురావు మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి సొంత నియోజకర్గమైన అంబర్​పేటలోనూ ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ యాదవ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

రాజస్థాన్​లో బీజేపీ హవా- వసుంధర, గహ్లోత్ లీడింగ్- పుంజుకున్న పైలట్​

మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ, ఆశించిన స్థానాలు దక్కకపోయినా మెరుగైన ఫలితాలు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో 118 చోట్ల పోటీ చేసి 105చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో 7 శాతం ఓట్లనే తెచ్చుకుంది. 2023 ఎన్నికల్లో మంచి సీట్లతో పాటు ఓట్లు శాతాన్ని పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే అనూహ్యరీతిలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సత్తా చాటితే.. పార్టీ ముఖ్యనేతలు వెనుకంజలో పడటం మాత్రం పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.

బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, అగ్ర నేతల ప్రచారం, కేంద్ర సర్కార్ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, హిందుత్వ ఎజెండా మెరుగైన ఫలితాలకు కారణంగా చెప్పుకోవచ్చు. పది నుంచి పదిహేను స్థానాల్లో ప్రభావం చూపిన బీజేపీ బండి సంజయ్​ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించకపోతే ఈ స్థానాలతో పాటు మరికొన్ని స్థానాల్లో విజయం సాధించేదని కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీజేపీలో నయా జోష్​- డ్యాన్సులతో హోరెత్తిస్తున్న లేడీస్- ఈమె నృత్యం హైలైట్!

Telangana Election Results Live 2023 : కాయ్ రాజా కాయ్ - ఎన్నికల ఫలితాల వేళ జోరుగా బెట్టింగ్‌​

Last Updated : Dec 3, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.