ETV Bharat / state

BJP Tarun chugh comments: 'కాంగ్రెస్, తెరాస నుంచి పాతికమంది నేతలు టచ్‌లో ఉన్నారు' - తెరాస నేతలపై తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్​పై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్( tarun chugh strong comments) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​కు దిల్లీలో షాక్ తగిలిందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెరాసకు అభ్యర్థులు దొరకరంటూ ఆరోపించారు.

BJP tarun chugh sensational comments, Tarun chugh sensational comments on CM KCR
తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు
author img

By

Published : Nov 26, 2021, 4:17 PM IST

Tarun chugh sensational comments on CM KCR: దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు షాక్ తగిలిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్​కు 60మంది కూడా అభ్యర్థులు దొరకరని చిట్ చాట్​లో ఆరోపించారు. కాంగ్రెస్, తెరాస నుంచి రెండు డజన్లకుపైగా నేతలు టచ్​లో ఉన్నారని స్పష్టం చేశారు.

80 సీట్లలో గెలవడం ఖాయం

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా 80 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమన్న ఆయన... వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారన్నారు. చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.