ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు మూడు సార్లు గడువు విధించినా... మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బతిమిలాడినా.... 3 వందలకు మించి ఉద్యోగులు విధుల్లో చేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ బెదిరింపులను తిరస్కరించి కార్మికులు ఒక్క శాతం కూడా విధుల్లో చేరకుండా నైతికంగా విజయం సాధించారన్నారు. సుమారు 48 వేల మంది కార్మికుల తిరస్కరణకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్తోపాటు భవిష్యత్ పోరాటాల్లోనూ భాజపా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె అంశాన్ని నడ్డా, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కేసీఆర్కు ఆర్టీసీ అస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదన్నారు. 2018 నూతన మోటార్ వాహనాల చట్టాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని... అందుకు అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా