NVSS Prabhakar on Delhi Liquor Scam: దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. లంచం ఇచ్చిన వాళ్లకే దళిత బంధు, రెండు పడక గదులను ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ సొమ్ములాగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పర్యవేక్షణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు.
మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరపాలి : దిల్లీ నూతన ఎక్సైజ్ విధానం.. తెలంగాణ విధానాన్ని అనుసరిస్తుందని ప్రభాకర్ ఆరోపించారు. దిల్లీ, తెలంగాణలో మద్యం సరఫరా చేసేది ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో మద్యం విధానాన్ని రెండు సార్లు సవరించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచారనీ దుయ్యట్టారు. అర్ధాంతరంగా ఎక్సైజ్ శాఖ మంత్రిని తొలగించారని పేర్కొన్నారు. కవిత కనుసన్నల్లో ఉన్నే వ్యక్తికే ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. తెలంగాణ ఎక్సైజ్ విధానం, మద్యం అమ్మకాలపైన సీబీఐ విచారణ జరపాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
'తెలంగాణ మద్యం విధానాన్నే దిల్లీ సర్కారు అనుసరించింది. దిల్లీ, తెలంగాణలో మద్యం సరఫరా చేసేది ఒక్కరే. తెలంగాణలో ఎనిమిదేళ్లలో మద్యం విధానాన్ని రెండు సార్లు సవరించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచారు. మద్యం అక్రమాలకు తెలంగాణ సర్కారు దిల్లీకి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లోనే ఆ అక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎక్సైజ్ విధానం, మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరపాలి.'-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: