ETV Bharat / state

ఏడాదిలో అనేక సంస్కరణలు: బండి సంజయ్​

ఏడాదిలో ప్రధాని మోదీ అనేక సంస్కరణలు చేపట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

bjp state president bandi sanjay speak on modi one year ruling
ఏడాదిలో అనేక సంస్కరణలు: బండి సంజయ్​
author img

By

Published : Jun 6, 2020, 2:12 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. 17వ లోక్‌సభలో 36 బిల్లులు ఆమోదం పొందడం మోదీ ఘనతగా చెప్పారు. భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ఏడాదిలో అనేక సంస్కరణలు: బండి సంజయ్​

దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ఆత్మనిర్భర భారత్‌ ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు ఇవ్వాలని భాజపా సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా ప్రభుత్వం దారి మళ్లీంచి జేబులు నింపుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.