ETV Bharat / state

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి - దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు తాజా వార్తలు

భాజపాకు విజయం చేకూర్చిన దుబ్బాక ప్రజలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తామన్నారు. హైదరాబాద్​లోని గన్​పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ గెలుపు నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమేనని అన్నారు.

bjp state president bandi sanjay says thanks to dubbak people
గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి
author img

By

Published : Nov 10, 2020, 5:49 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్​లోని గన్​పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. భాజపాకు దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయం అందించారని చెప్పారు. నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే తమకు విజయం అందించారన్నారు. రాబోయే రోజుల్లో భాజపా ఇదే విజయపరంపర కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తామన్నారు. తెరాస.. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు యత్నించిందని ఆరోపించారు. దుబ్బాక ప్రజలు నిజాయతీతో మంచి సందేశం ఇచ్చారని చెప్పారు. విజయోత్సవం జరుపుకోకుండా పోలీసులతో అడ్డుకునేందుకు యత్నించారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామన్నారు.

ఇదీ చదవండి: దుబ్బాక గెలుపుతో కమలదళంలో కొత్త ఉత్సాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.