ETV Bharat / state

రైల్వే ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేయండి : బండి సంజయ్​ - కరీంనగర్ లోక్​సభ పరిధిలో రైల్వే పనులపై బండి సంజయ్​ వినతిపత్రం

కరీంనగర్​ లోక్​సభ పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై భారత రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో​ సునీత్​ శర్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కలిశారు. చేపట్టాల్సిన అభిృవృద్ధి పనులు, నిధుల విడుదలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

bandi sanjay meet railway board chairman today
రైల్వే ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేయండి : బండి సంజయ్​
author img

By

Published : Feb 10, 2021, 11:05 PM IST

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైల్వే బోర్డు ఛైర్మన్​ సునీత్​ శర్మను కలిశారు. పెండింగ్​లో ఉన్న రైల్వేప్రాజెక్టులపై చొరవ చూపాలని కోరారు. అభివృద్ధి పనులు, నిధుల విడుదల అంశాలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.

రైల్వే ఓవర్​ బ్రిడ్జ్​లు నిర్మించండి

కరీంనగర్​లోని తీగలగుట్టపల్లి దగ్గర వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్​ వద్ద వాహన రద్దీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరినట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపిందని.. దీన్ని ప్రత్యేకమైన అంశంగా పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కొత్తపల్లి నుంచి గంగాధర (రామడుగు గేట్) వైపుగా వెళ్లే మార్గంలో రైల్వే క్రాసింగ్​ను రద్దు చేసి రైల్వే అండర్ బ్రిడ్జ్ లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

కాజిపేట్​- పెద్దపల్లి మార్గంలో బైపాస్​ లైన్​

పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట్-పెద్దపల్లి మార్గంలో బైపాస్ లైన్ నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని, నిధుల లభ్యతను బట్టి ముందడుగు వేయాలన్నారు. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.325 కోట్లు కేటాయించారని.. పనులు వేగవంతం చేయాలని కోరారు. రాజధానిని అనుసంధానించే మార్గం కారణంగా సత్వరమే ఈ పనులు పూర్తిచేయాలని సూచించారు.

కొత్త లైన్లపై దృష్టి సారించాలి

కరీంనగర్ - హసన్​పర్తి వయా హుజూరాబాద్ మీదుగా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం సర్వే పనులకు గతంలోనే అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ లైన్ ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్​లో కేటాయింపులు జరగలేదన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే సప్లిమెంటరీ బడ్జెట్​లోనైనా ఈ లైన్​కు తగిన నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నుంచి చెన్నై, ముంబయి, షిరిడితో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను నడపాలని కోరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ లిఫ్ట్​, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మరో ప్రవేశ ద్వారం, లోడింగ్-అన్ లోడింగ్ వసతులు, మల్టీ ఫంక్షనల్​ కాంప్లెక్స్​ నిర్మించాలని రైల్వే బోర్డు ఛైర్మన్​కు విన్నవించారు. డిమాండ్లపై ఆయన సానుకూలంగా స్పందించారని బండి సంజయ్​ తెలిపారు.

ఇదీ చూడండి : మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.