ETV Bharat / state

కేసీఆర్‌ పాటపై బండి కౌంటర్.. జనగణమన కూడా రాశారంటూ..!

మునుగోడు ఉపఎన్నికలో అని ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఉపఎన్నికలో అధికార యంత్రాంగాన్ని తెరాస వాడుకుంటుందని ఆరోపించారు. మునుగోడు సమస్యలపై తానే పాట రాసినట్లు కేసీఆర్‌ చెప్పుకున్నారు. సాధారణ ఎన్నికలు వస్తే జనగణమన కూడా తానే రాశానని కేసీఆర్‌ చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.

BJP STATE PRESIDENT BANDI SANJAY KUMAR FIRES ON CM KCR ABOUT MUNUGODE BYPOLL 2022

author img

By

Published : Nov 1, 2022, 3:30 PM IST

Updated : Nov 1, 2022, 3:49 PM IST

కేసీఆర్‌ పాటపై బండి కౌంటర్.. జనగణమన కూడా రాశారంటూ..!

మునుగోడు ఓటర్లను తెరాస ప్రలోభాలకు గురిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉపఎన్నికలో అధికార యంత్రాంగాన్ని తెరాస వాడుకుందని విమర్శించారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల గురించి కేసీఆర్‌ ఏనాడు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు సమస్యలపై తానే పాట రాసినట్లు కేసీఆర్‌ చెప్పుకున్నారు.. సాధారణ ఎన్నికలు వస్తే జనగణమన కూడా తానే రాశానని కేసీఆర్‌ చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. సహకార సంఘాల ఎన్నికలు జరుపుతానని మాట తప్పారని మండిపడ్డారు.

''చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయమై భేటీలో అంగీకరించారు. చేనేత వస్త్రాలపై రాష్ట్ర వాటా జీఎస్టీ వదులుకోవచ్చు కదా. హుజూరాబాద్‌ ఎన్నిక సందర్భంగా దళితబంధు తెచ్చారు. రాష్ట్ర సంక్షేమ పథకాలతో ఎందరు లాభపడ్డారో జాబితా విడుదల చేయాలి. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తి కావాలా? కాపలాదారు కావాలా? తేల్చుకోవాలి. కొందరికి రైతుబంధు ఇచ్చి మిగతావన్నీ నిలిపివేశారు.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షడు

ఉపఎన్నిక వచ్చినందునే ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు గుర్తుకు వచ్చారన్న బండి.. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ సిబ్బంది బలికావొద్దని సూచించారు. టీఎన్‌జీవో నేతల స్వార్థానికి తెలంగాణ ఉద్యోగులు బలయ్యారని ఆరోపించారు. త్వరలో తెరాస నేతల ఆస్తుల వివరాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. ధరలు పెరుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ తగ్గించారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు సరిగా రాక రుణాలు తీసుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఇప్పటివరకు 3 డీఏలు.. ప్రయోజనాలు ఇవ్వట్లేదని వెల్లడించారు. ఉద్యోగుల మనోభావాలను ఫాంహౌస్‌లో తాకట్టుపెట్టారని బండి ఫైర్ అయ్యారు. 317 జీవోకు వ్యతిరేకంగా పోరాడి ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. 317 జీవో వల్ల ప్రయోజనాలు .. కొత్త నియామకాలు వస్తాయని చెప్పారు.. ఉద్యోగుల జీతాలు, పీఆర్‌సీ కోసం భాజపా పోరాడిందని వివరించారు.

''ఉద్యోగుల మనోభావాలను సీఎం కాళ్ల వద్ద తాకట్టుపెట్టారు. ఉద్యోగవర్గాలకు తెరాస నేతలు క్షమాపణ చెప్పాలి. సామాజిక మాధ్యమాల్లో తెరాస నేతలను దూషిస్తున్నారు. 317 జీవోకు బలైన ఉద్యోగుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో మునుగోడులో భాజపా పూర్తి మెజార్టీతో గెలుస్తుంది. తెరాస గెలవకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులను బెదిరించారు. సాయంత్రం 6 తర్వాత మా శ్రేణులు మునుగోడులో ఉండరు. ఇతర పార్టీల నేతలు మునుగోడులో ఉంటే స్థానికులు పరుగెత్తించాలి. తెరాస ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈటలను గెలిపించారు. అవాంచనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. తెరాస అభ్యర్థి గెలిస్తే కేసీఆర్‌ వద్ద బానిసలా ఉండాల్సి వస్తుంది. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించి.. భాజపా ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంద''ని బండి సంజయ్ అన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 1, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.