భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం జీవోలు జారీ చేయడం దుర్మార్గపు చర్య అభివర్ణించారు. వైన్స్ కోసం కూడా ప్రత్యేక జీవోలు జారీ చేయడం తెరాస ప్రభుత్వం సాధించిన ఘనతని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరమన్నారు.
సీనియర్ లెక్చరర్, ఎక్సైజ్ సీఐ పదవి కాలం పొడిగింపులకు జీవోలు జారీ చేయడం ఏంటని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రభుత్వం రహస్యంగా జారీ చేసిన జీవోలకు లెక్కలేదు... జారీ చేయాలనుకుంటున్న వాటికి అంతు లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పునరాలోచించుకోవాలని కోరారు.
రాష్ర్ట ప్రభుత్వం వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు పంపిణీ చేయకపోవడం వల్లే వైద్యులకు కరోనా వచ్చిందన్నారు. వైద్యులనే కాపాడలేని ప్రభుత్వం సామాన్య ప్రజలను ఏమీ కాపాడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తామే కొవిడ్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?