నిజాంను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యపై బీఎన్ రెడ్డి నగర్లో భాజపా తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆయనతో పాటు ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు తెలిపి దీక్ష విరమింపజేశారు.
రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా... ఇంత వరకు రిజిస్ట్రేషన్ సమస్య తీరలేదన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారి దొంగ జీవోలను తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.