ETV Bharat / state

'మత ఘర్షణలు ఎక్కడ జరుగుతున్నాయో కేసీఆర్‌, కేటీఆర్‌ చెప్పాలి' ​

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​పై భాజపా నేతలు ప్రచారంలో భాగంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్​ కవాడిగూడ డివిజన్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్​తో కలిసి రోడ్​ షో నిర్వహించారు. దేశంలో దాదాపు 80 శాతం స్థానిక సంస్థల్లో భాజపానే అధికారం ఉందని వెల్లడించారు.

BJP State President Bandi Sanjay and OBC Morcha National President Laxman Election Campaign at Kavadiguda Division, Hyderabad
మత ఘర్షణలు జరుగుతున్నాయో కేసీఆర్‌, కేటీఆర్‌ చెప్పాలి: బండి ​
author img

By

Published : Nov 28, 2020, 1:38 PM IST

Updated : Nov 28, 2020, 3:32 PM IST

దేశంలో దాదాపు 80 శాతం స్థానిక సంస్థల్లో భాజపానే అధికారంలో ఉందని... ఎక్కడ మత ఘర్షణలు జరుగుతున్నాయో కేసీఆర్​, కేటీఆర్​ నిరూపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల్లో భయాందోళనలు కల్పించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలని తెరాస ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి కవాడిగూడ డివిజన్‌లో రోడ్ షో నిర్వహించారు. గల్లీ ఎన్నికలకు దిల్లీ నాయకులు ఎందుకని కేటీఆర్​ ప్రశ్నిస్తున్నారని... మరి తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలను డివిజన్లలో ఎందుకు మోహరించిందని లక్ష్మణ్‌ నిలదీశారు. మార్పు కోసం బల్దియాలో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

Last Updated : Nov 28, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.