tarun chug in bandi sanjay deeksha: తెలంగాణ బంగారం కాలేదని. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందని భాజాపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు తెరాస ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షను ఆయన ప్రారంభించారు.
tarub chug in cm kcr: తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని యువత ఆశించగా.. ఎలాంటి లాభం చేకూరలేదని తరుణ్ చుగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకున్నారని మండిపడ్డారు. విపక్ష నేతల ఇళ్ల చుట్టూ పోలీసులను మోహరిస్తున్నారన్న తరుణ్ చుగ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా హవా చూపిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం తెరాస. తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక పాలన సాగిస్తోంది. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ సార్ రాత్రి సమయంలో మాత్రమే కేబినేట్ భేటీ పెడతారు. 50 వేల ఒప్పంద ఉద్యోగులు, 70 వేల ఫీల్డ్ అసిస్టెంట్స్, 22 వేల స్కిల్ మిషన్, 400 మిషన్ భగీరథ ఇంజినీర్లు, 1600 నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ పాపమంతా కేసీఆర్‌దే. కేసీఆర్ సాహెబ్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలు కేసీఆర్ విధానాలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆరే. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారు. - తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
- ఇవీ చూడండి:
- Bandi Sanjay UnEmployment Strike : బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ప్రారంభం
- Bandi Sanjay Deeksha: నేడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
- దీక్షకు అడ్డంకులు.. కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: బండి సంజయ్
- Vinod kumar on BJP: బండి సంజయ్‌కు దీక్ష చేసే నైతికత ఎక్కడుంది: వినోద్ కుమార్
- BJP Nirudyoga deeksha: బండి సంజయ్ నిరుద్యోగ దీక్షా వేదిక మార్పు