ETV Bharat / state

ఈ నెల 12న హైదరాబాద్​కు తరుణ్​ చుగ్​.. తాజా రాజకీయాలపై చర్చ

author img

By

Published : Aug 4, 2022, 8:37 PM IST

TARUN CHUGH: రాష్ట్రంలో తాజా రాజకీయాలపై సమీక్ష నిర్వహించేందుకు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర , మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర నాయకత్వంతో చర్చించనున్నారు. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందు బండి సంజయ్‌ ఎల్లుండి ఉదయం దిల్లీ వెళ్లనున్నారు.

తరుణ్‌ చుగ్‌
తరుణ్‌ చుగ్‌

TARUN CHUGH: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కెంది. దీంతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సంగ్రామ యాత్ర సాగుతున్న తీరు.. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నాయకత్వంతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణను రూపొందించనున్నారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు తరుణ్‌ చుగ్‌ సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

ఎల్లుండి దిల్లీ వెళ్లనున్నబండి సంజయ్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎల్లుండి ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి ఆ ఒక్క రోజు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. తిరిగి మరుసటి రోజు నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర: రాష్ట్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది. రాష్ట్రంలో రానున్నది భాజపా ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని బండి సంజయ్ గుర్తు చేశారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు.

తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని .. రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని అన్నారు. పార్టీలో చేరేవారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదని చెప్పారు. పార్టీ నిర్ణయమే ఫైనల్​ని తెలిపారు​. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోదీ పథకాలను ప్రశంసించారని ఆయన అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో 30ఏళ్లు సుశిక్షితుడైన కార్యకర్తగా పనిచేశానని వెల్లడించారు.

ఏ పని అప్పగించినా రాజీపడకుండా పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డానని వివరించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టిపెట్టాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనావేసే పనిలోపడ్డాయి.

ఇవీ చదవండి: వీఆర్వోల సర్దుబాటుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ..

దీదీ సర్కార్​ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ.. బాబుల్​ సుప్రియోకు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.