భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాశారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడా అరెస్టు చేయడం దారుణమన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.
ఇదీ చదవండి: పటాన్చెరులో భాజపా నాయకుల ముందస్తు అరెస్టులు