భారతీయ సంస్కృతికి చిహ్నం రక్షాబంధన్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమిని జరుపుకుంటామని ఆయన వెల్లడించారు. సంజయ్కు ఆయన సోదరి శైలజ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలోని ప్రతి మహిళ ఆత్మగౌరవంతో నిలబడేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అయన వివరించారు. రాష్ట్ర ప్రజలందరికి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..