రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేయాలని భాజపా ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతూ... హైదరాబాద్‌లో డప్పుల మోత కార్యక్రమం నిర్వహించింది. ఎల్బీ స్టేడియం నుంచి డప్పు చప్పుల్లతో చేపట్టిన నిరసన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరుకు కొనసాగింది. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్, బండి సంజయ్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తక్షణమే రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే తమ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, విజయశాంతి, రాజాసింగ్ సైతం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: kishan reddy latest news: 'సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు'