ETV Bharat / state

జీహెచ్​ఎంసీపై కాషాయం జెండా ఎగిరేనా..?

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కమలనాథులు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. బల్దియాపై కాషాయ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో భాజపా జాతీయ నాయకత్వం... ప్రత్యేక దృష్టి సారించింది. 2023 ఎన్నికల ముందు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ పోరును సెమీ ఫైనల్‌గా భావించి బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. అధికార తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. వరుస సన్నాహక సమావేశాలతో.. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ దూసుకెళ్తోంది. జాతీయ, రాష్ర్ట స్థాయిలో.. కమిటీలు నియమించింది. దుబ్బాక విజయోత్సాహంతో గ్రేటర్‌ పోరులోనూ.... అదే జోరు కొనసాగించేందుకు రాష్ర్ట నాయకత్వం పక్కా ప్రణాళికలు రచిస్తోంది.

bjp ready to greater hyderabad municipal corporation elections
జీహెచ్​ఎంసీపై కాషాయం జెండా ఎగిరేనా..?
author img

By

Published : Nov 17, 2020, 10:31 PM IST

Updated : Nov 17, 2020, 11:05 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగడానికి ముందే... సన్నాహాలు ప్రారంభించిన భారతీయ జనతాపార్టీ... ఇప్పుడు ప్రకటన వెలువడటంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. వరుస సమావేశాలు, అభ్యర్థుల అన్వేషణ, మ్యానిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. బల్దియా పోరులో పైచేయి సాధించేందుకు...అధికార తెరాసకు దీటుగా ఆరు నెలలుగా క్షేత్రస్థాయిలో.. భాజపా పక్కా వ్యూహాలు రచించింది. వరద బాధితులకు అందాల్సిన సాయంలో అవకతవకలు జరిగాయన్న వాదనను.. పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. " మన హైదరాబాద్‌ మన తెలంగాణ” , "అందరికీ అవకాశం ఇచ్చారు మాకు అవకాశం ఇవ్వండి “, " మార్పు కోసం భాజపా ”, "భాజపా కోసం మనం" అనే నినాదాల్లో ఏదో ఒకటి తీసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని కాషాయదళం యోచిస్తోంది.

డివిజన్ల వారీగా సర్వేలు

ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించిన భాజపా.... బలమైన అభ్యర్థులను గుర్తించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన, ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన సిట్టింగ్‌ కార్పొరేటర్లకు టికెట్‌ ఇవ్వాలని సూత్ర పాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెరాస, కాంగ్రెస్ అసంతృప్తులు, టికెట్ దక్కే అవకాశంలేని బలమైన నాయకులను చేర్చుకునే ప్రయత్నాలను కమలదళం ముమ్మరం చేసింది. మొదట 30 నుంచి 40 డివిజన్లకు తొలి విడత అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసింది.

కీలక నేతలను ఇంఛార్జీలుగా

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై ముఖ్యనేతలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, మురళీధర్‌ రావు, డీకే.అరుణతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌నేతలు పలుమార్లు సమావేశమై పార్టీ వ్యూహాలపై చర్చించారు. పార్టీ అనుబంధ సంఘాలైన బీజెవైయం, మహిళామోర్ఛా, కిసాన్‌ మోర్ఛా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చాలతో.... కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ సమావేశమై క్షేత్రస్థాయి ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌ మేనిఫెస్టోను మాజీ ఎంపీ వివేక్‌ నేతృత్వంలో చంద్రవదన్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కర్ణాగోపాల్‌, ప్రకాశ్‌ రెడ్డి సభ్యులతో కూడిన కమిటీ రూపకల్పన చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు, వంద రోజుల ప్రణాళికపై ఛార్జిషీట్‌ వేయనుంది. మరుసటి రోజు మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు....... కీలక నేతలను ఇంఛార్జీలుగా ఇతర సీనియర్‌ నేతలకు డివిజన్ల బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది.

2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా

పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుని తెరాస తరువాత స్థానంలో నిలిచిన భాజపా.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకున్న ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ధీమాగా చెబుతూనే.. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సెమీ ఫైనల్‌గా భావిస్తున్న గ్రేటర్‌ ఎన్నికలపై.. కాషాయ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో పనిచేస్తోంది. జాతీయ నాయకత్వం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా శిష్యుడు, పార్టీ ప్రధానకార్యదర్శి అయిన భూపేంద్ర యాదవ్‌కు ఈ బాధ్యత అప్పగించింది. భూపేంద్రయాదవ్‌ మొత్తం ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తారు. సహ సమన్వయకర్తగా కర్ణాటక వైద్య,ఆరోగ్యశాఖమంత్రి సుధాకర్ వ్యవహరించనున్నారు.

కిషన్ రెడ్డి ఛైర్మన్‌గా ఒక కమిటీ

జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లాలకు ఇంఛార్జిలుగా... మహారాష్ర్ట ప్రభుత్వ ఛీప్‌విప్ ఆశీష్‌ సెలార్, గుజరాత్‌ భాజపా కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ వాఘేలా, కర్ణాటక మంత్రి సతీష్ రెడ్డిలను నియమించింది. భాజపా రాష్ట్ర నాయకత్వం ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. 23 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో లక్ష్మణ్, మురళీధర్‌రావు, డీకే.అరుణతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలకు చోటు కల్పించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహాల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా కాషాయదళం వ్యూహాలు రచిస్తోంది.

మేయర్‌ పీఠంపై కన్ను

బల్దియా ఎన్నికల ప్రచారంలో తెరాస వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీశ్రేణులకు భాజపా రాష్ర్ట నాయకత్వం సూచించింది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, డీకే.అరుణ, మురళీధర్‌రావు, రాజాసింగ్‌, రఘునందన్‌రావుతోపాటు ఇతర కీలక నేతలను ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని చెబుతూ వస్తున్న కాషాయదళం.. గ్రేటర్‌ పోరులో కాషాయజెండా ఎగరవేసి.. అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాన్ని బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకున్న కమలనాథులు... ఈసారి మేయర్‌ పీఠంపై కన్నేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో గ్రేటర్​ హడావుడి.. 21న మేనిఫెస్టో!

Last Updated : Nov 17, 2020, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.